Saturday, February 7, 2009

H1B నిరాకరణ: మీడియా మాయాజాలం

H1B వీసాలతో ఉన్న భారతీయులను తీసుకోవడానికి ఇకపై కంపెనీలు సంకోచించేలా ప్రస్తుతానికి ఉన్న బిల్లును అమెరికా శాసనసభ ఆమోదించింది. దాని ప్రకారం అమెరికాలో ఉద్దీపన పథకాలు అందుకుంటున్న కంపెనీలు H1B ఉద్యోగులకన్నా ముందుగా అమెరికా పౌరులను తీసుకోవాలి. వారు ఎవ్వరూ లేకపోతే అప్పుడు మాత్రమే H1B ఉద్యోగులను తీసుకోవాలి కానీ దానికి కూడా అనేక షరతులు ఉన్నాయి. ఇకపై అమెరికా రావాలనుకుంటే చాలా కష్టమే. ఒక్కసారి ఉద్దీపన పథకాలు అందుకుంటున్న ముఖ్యమైన కంపెనీలను చూద్దాం. అవి బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూపు, వెల్స్ ఫార్గో, క్రైస్లర్, జెనరల్ మోటార్స్ ముఖ్యమైనవి. మన భారతీయులకు ఉద్యోగాలలోకి తీసుకోవడంలో కూడా ఇవే ముఖ్యమైనవి. ఈ బిల్లు వల్ల ఖచ్చితంగా భారత H1B ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంటుంది.

ఇప్పటిదాకా మన మీడియా ఒబామాకు మరియు ఉపాధ్యక్షుడయిన జో బిడెన్ కు చాలా ప్రచారం చేసారు. వారు భారతప్రియులని అబద్దాలను ప్రచారం చేసారు. వారి అబద్దాలన్నీ ఇవ్వాళ్టితో ప్రజలకు కనబడుతాయని అనుకుంటున్నాను. ఒబామా భారతప్రియుడని ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి. దయచేసి ఎవ్వరూ ఒక రెండురోజులు TV9 చూడకండి, ఉన్నదానికన్నా ఎక్కువ చేసి ప్రజలను హింసిస్తాడు. ఈనాడు పత్రికను కనిపిస్తే కాల్చేయాలన్నంత కోపంగా ఉంటోంది ఈ వార్తను చదివాక. ఇన్ని అబద్దాలు ఎవరిని మభ్యపెట్టాలని ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడి పరిస్థితులు తెలియవు, కానీ వారికి నచ్చినవి మాత్రం రాస్తారు. ఒబామాకు మన భారతీయులు కూడా సాయం చేసారు క్యాలిఫోర్నియాలో. అక్కడి వాళ్ళు ఏమని అంటారో చూడాలి.

ఇక్కడ అమెరికాలో H1B ఉద్యోగులవల్ల అమెరికా పౌరులకు ఉద్యోగాలు దూరమవుతున్నాయని విపరీతమైన ప్రచారం. అందుకే అనేక అమెరికన్లకు భారతీయులంటే ఇష్టం ఉండదు. వారి ముప్పైకోట్ల జనాభాకు మన ముప్పైలక్షలమంది ఏ విధంగా అడ్డంకో నాకు అర్థం కాదు. వారు కూడా మెదడుతో ఆలోచించరు. ఈ మీడియా ఏమి చెబితే అది నమ్ముతారు. ఇక అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులకు చాలా కష్టమే. సొంతగూటికి వెళ్ళలేరు, ఇక్కడే ఉండలేరు. ఇక అమెరికాలో ఉంటున్న ప్రవాసభారతీయులను ఆ దేవుడే కాపాడాలి. అమెరికాలో అమెరికా పౌరులకన్నా H1B ఉద్యోగులే ఎక్కువ ట్యాక్సు కడతారని అక్కడి పాలకులు మరచినట్లున్నారు. ఇక్కడ అమెరికన్లు ఉద్యోగం చేస్తేనే పన్నులు కడతారు కానీ H1B ఉద్యోగులు ఉద్యోగంతో సంబంధం లేకుండా పన్ను కడతారని అమెరికా పాలకులు మరచిపోతున్నారు.

6 comments:

  1. సరిగ్గా చెప్పారు... నల్లజాతి వజ్రం అని, భారతీయుల ఆశాకిరణం అనీ... ఏవేవో రాశారు మన మీడియా లో ఒబామా గురించి.. కాస్త నేలమీద నిలబడి నిజాలు ఇప్పుడైనా రాస్తారని ఆశిద్దాం....

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ఆయన అమెరికా అధ్యక్షుడైతే ఇండియా మీడియాకు ఒరిగేదేమిటో అర్థం కావటం లేదు. ఇంకా ఒబామా పనితనం తెలియకముందే అంతలా ఆకాశానికి ఎత్తేయటం ఏమిటో??

    ReplyDelete
  4. ఇంతకు ముందు పోష్టులకి, ఈ పోష్టుకి తేడా - ఖచ్చితమయిన ఆలోచనావిధాన లోపం... ఎవడో మనకు ఏదో చెయ్యలేదని వాడి మీద బుఱద చల్లటం ఏమిటండీ...అసలు ఒబామాకు ఏమి అవసరం మనవాళ్ళకు సాయం చేయటానికి? ముందు ఆయన దేశ ప్రజల గురించి చూసుకుంటాడా ? ఈ దేశానికి అవసరార్థం, ఉద్యోగార్థం వచ్చిన వాళ్ళ గురించి చూస్తాడా ? ఎవరికోసమో తన వాళ్ళ పంచెలు ఊడగొడతాడా? ముందు తన ఇల్లు బాగుచేసుకుంటే తరువాత వేరే వాళ్ళ ఇళ్ళు....మనవాళ్ళు ఒబామాకు ఏమీ ఊరకే డబ్బులు ఇవ్వలా...కణికులమయిపోదామనే ఇచ్చింది.....ఈ టపాకు కామెంటు ఇంకా దీర్ఘంగా వ్రాయొచ్చు, కానీ అనవసర వివాదాలు ఎందుకని...ఇంతే సంగతులు చిత్తగించవలెను...

    ఇలాటివి రాసుకునే పనే అయితే, ఇక నాలాటి వారు మీ బ్లాగు వైపు చూడకపోవచ్చు.. అందువలన మీకు నష్టం అని కాదు కానీ....మీకే తెలియాలె...:)

    ReplyDelete
  5. ఇంకో మాట నేను ఈ దేశంలో హెచ్1 మీద ఉన్న, ఉంటున్న ఉద్యోగినే...:)...

    ReplyDelete
  6. i was just pissed off by the way media had portrayed obama and he had shown his true colors. i still believe in what i had written in previous post and in this one also. u are rite abt why obama shud help us. then why is this stupid media portraying him as such.

    ReplyDelete