Tuesday, February 3, 2009

కుల వ్యవస్థ: వైదిక కాలం

కులవ్యవస్థ మీద ఇది నా రెండవ టపా. ఈ టపాలో నేను వైదిక కాలం నుంచి జరిగిన చరిత్రను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఒక్కసారి మళ్ళీ మొదటినుంచి వద్దాం. హిందూమతానికి మూలం వేదాలు. వేదాల తరువాత ఉపనిషత్తులు, పురాణాలు. వీటితో పాటు రామాయణమహాభారతాలు.
వేదాల ప్రకారం మానవ జీవితం నాలుగు భాగాలు – బ్రహ్మచారి, సంసారి, వానప్రస్థం, సన్యాసం. వీటిని ఖచ్చితంగా పాటించాలని లేదు. అదే విధంగా సమాజం నాలుగు భాగాలు (చాతుర్వర్ణవ్యవస్థ) – బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు గురువులు, పుజారులు. క్షత్రియులు పాలించేవారు, సైనికులు. వైశ్యులు వ్యవసాయం మరియు వ్యాపారం చేసేవారు. శూద్రులు వ్యవసాయం మరియు మిగతా పనులు చేసేవారు. చాతుర్వర్ణవ్యవస్థ కేవలం చర్యలవల్లనే తప్ప జన్మ అధారంగా కాదని వేదాలు చెబుతున్నాయి. ఒక్కసారి ఉదాహరణ ఉపయోగిస్తే అర్థం అవుతుంది. ఒకప్పుడు సమాజంలో అధికసంఖ్యాక ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. వారికి రక్షణగా కొంతమంది ఉండేవారు. వారే క్షత్రియులు. కొంతమంది నేర్పించేవారు. వారే బ్రాహ్మణులు. అప్పుడు సూద్రులు లేరు. కొంతమందికి ఇది కష్టంగానూ నమ్మశక్యంగానూ ఉండవచ్చు, కానీ ఈ మాట స్వయంగా మన రాజ్యాంగనిర్మాత అయిన అంబేద్కర్ చెప్పడు కేవలం మూడు కులాలు మాత్రమే ఉన్న సమాజం ఉండేదని. పచ్చిగా చెప్పాలంటే ప్రతీ ఒక్కరికీ ఏదోరకమయిన టాలెంటు ఉంటుంది. దాన్ని సమాజం యొక్క శ్రేయస్సు కొరకు ఉపయోగించడమే వర్ణవ్యవస్థ యొక్క లక్ష్యం. మరొక ఉదాహరణ ఋగ్వేదంలో “సూద్రుడు” అనే పదం పురుషసూక్తిలో తప్ప ఎక్కడా కనబడలేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పేర్లు చాలాసార్లు ఉన్నాయి. బ్రాహ్మణులను ఎదిరించడం వలన క్షత్రియులే సూద్రులుగా మారారని మనకు అంబేద్కర్ గారు సోదాహరణంగా వివరించారు.
ఋగ్వేదంలో మొట్టమొదటిసారి కులాలవారు ఎలా వచ్చారో పురుషసూక్తిలో చెప్పారు.tasmAt virAd ajAyata virAjo adhipUrusha : sa jAto atyaricyata pashcAd bhUmimatho pura: 5
purusha sukta - 5
ఆ సూక్తి యొక్క భావం “బ్రాహ్మణులు తలనుంచి, క్షత్రియులు భుజాలనుంచి, వైశ్యులు ఊరువులనుంచి, శూద్రులు పాదాలనుంచీ వచ్చారు.” దానినే నేను మరోవిధంగా చెబుతాను. ఇక్కడ పురుషుడు అంటే సమాజం అని అర్ధం. బ్రాహ్మణుల తల (అంటే మేధాశక్తి), క్షత్రియుల చేతులు (శౌర్యం, యుద్దవిద్యలు – యుద్దం ఎక్కువగా చేతులను ఉపయోగించి చేస్తారు), వైశ్యుల ఊరువులు (వైశ్యులు ఇతర దేశాలు తిరిగి ఎక్కువ ధనం సంపాదించాలని అర్థం), శూద్రులు పాదాలద్వారా (శూద్రుల యొక్క కష్టపడే శక్తి) సమాజం అభివృద్ది చెందుతుందని అర్థం.
ప్రజలకు వేదాల అర్థాన్ని సులభతరం చేయడానికి ఉపనిషత్తులను వ్రాశారు. వేదాలలో ఉన్న అన్ని విషయాలగురించి సమగ్రంగా విపులంగా మనకు ఉపనిషత్తులలో వివరించారు కానీ వర్ణవ్యవస్థగురించి మాత్రం ఏ ఉపనిషత్తులోనూ వివరించలేదు. దీనిని బట్టి ఒకటి ముందు ఉపనిషత్తులయినా రచించి ఉండాలి లేదా వేదాలలో కొన్నింటిని తరువాత అదనంగా చేర్చి ఉండాలి. పురుషసూక్తి కూడా అలా వచ్చిందేనని స్వయంగా అంబేద్కర్ గారు సెలవిచ్చారు. వారు చెప్పిన కొన్ని విచారించదగ్గ అంశాలు. ఋగ్వేదంలోని మిగతా సూక్తులకు పురుషసూక్తి ఒక ప్రధాన భేదం ఉంది. అన్ని సూక్తులు ఒక గురువు తన శిష్యుడికి వివరిస్తున్నట్లు ఉంటాయి, కానీ పురుషసూక్తి మాత్రం అలా ఉండదు. It doesn’t follow the pattern of other slokas. ఋగ్వేదంలోని మిగతా సూక్తులకు పురుషసూక్తికి భాషలో కూడా చాలా తేడా ఉంది. పురుషసూక్తిలో భాష చాలా సరళంగా అర్థమవుతుంది కానీ మిగతా సూక్తులలో భాష చాలా కఠినంగా ఉంది. సంస్కృతంలో ఆరితేరిన ఉద్దండులు తప్ప కాస్తొ కూస్తో సంస్కృతం మీద పట్టుతో ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం (1). పురుషసూక్తి ఋగ్వేదంలోకి తరువాతి కాలంలో చేర్చారని దీనిని బట్టి స్పష్టమవుతోంది.
పురాణాలు ఉపనిషత్తులు కాకుండా ఇతర గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. రాక్షసగురువు శుక్రాచార్యుడు వర్ణవ్యవస్థ గురించి ఇలా చెప్పాడు-
నజాత్య బ్రాహ్మణశ్చాత్ర క్షత్రియో వైశ్య ఏవ న
న శుద్రో న చ వై మ్లేఛ్ఛిచో భేదితా గుణకర్మాభి:
(ఈ ప్రపంచంలో ఎవ్వరు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సుద్రులుగా జన్మ వలన నిర్నయింపబడరు, కేవలం తమ పనులవలన నిర్నయింపబడుతారు.)
శుక్రాచార్యుడు రాక్షసగురువయినా బ్రాహ్మణులు మాంసాహారం ముట్టరాదని చెప్పినవాడు. ఆహారం గురించి శుక్రుడు చెప్పిన నీతిని ఆచరిస్తున్న బ్రాహ్మణులు ఇతరత్రా విషయాలలో ఎలా అతని మాటను జవదాటగలరు?
కులవ్యవస్థను వ్యతిరేఖించేవారు చెప్పే మరొక ఉదాహరణ మనుసంహిత. మనుసంహిత కూడా ఇతర అన్ని గ్రంథాలవలె తరువాతి కాలంలో మార్పులకు గురయ్యిందని నేను అంటాను. దానికి కొన్ని ఉదాహరణలు. మనుసంహితలో అనేక రకాలుగా సూద్రులను తక్కువవారనీ వారికి ధనం అందకుండా చేయాలనీ చెప్పే సూక్తులు ఉన్నాయి. నేను వీటికి వ్యతిరేఖంగా ఉండే కొన్ని సూక్తులు. మనుసంహితలోని సూక్తులు 2:223, 10:128, 2:240, 2:238 కొన్ని ఉదాహరణలు. కొన్ని సూక్తులలో బ్రాహ్మణకుటుంబీకుడు ముందుగా తన వద్ద ఉన్న (ఉంటేనే) సూద్రులకు (పనివాళ్ళు) భోజనం పెట్టాలని ఉన్నది. బ్రిటీషువాళ్ళు భారతదేశంలో శిక్షాస్మృతి తయారుచేస్తున్నప్పుడు మనుసంహితను ఆధారంగా చేసుకుని రూపొందించారు. అలాంటిది మనవాళ్ళకు మనుసంహితలో ఎక్కువ తప్పులు కనబడుతున్నాయి కానీ ఆ సంహితలోని గొప్ప విషయాలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.
మనం ఒక ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి (Mr.H) హత్య చేసాడని అనుకుందాం. Mr.H చట్టంలోని చిన్న లొసుగును పట్టుకొని మంచి లాయరును పట్టుకుని బాగా ఖర్చు పెట్టి శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. దీనికి యధావిధిగా పోలీసులు, రాజకీయనాయకులు, పత్రికలు Mr.Hకు సహాయం చేసి తాము కొంత డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు జరిగిన హత్యకి న్యాయం జరుగలేదు. అందుకు మన మొత్తం న్యాయవ్యవస్థ విఫలం అయ్యిందని దాని రద్దు చేద్దామా? లేక న్యాయం జరుగలేదని భారతదేశంలో ఎమర్జెన్సీ విధిద్దామా? కేవలం ఒక చిన్న లొసుగువల్ల, కొందరు దుర్మార్గులు లంచం తీసుకోవడం వల్ల ఎలాగైతే మన వ్యవస్థ మొత్తం విఫలమైనట్లు కాదో అలాగే అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు ఉండడం వల్ల వర్ణవ్యవస్థ మరియు ఏకంగా హిందూ మతం కేవలం ఉన్నత వర్గాలవారికోసమని అనుకోవడం మూర్ఖత్వం. తప్పుగా ఉన్న స్లోకాలను మనం సరిదిద్దుదాం. మన సంస్కృతిని కాపాడుదాం.
(ఇంకా ఉంది)
1. అంబేద్కర్ వ్రాసిన పుస్తకంలో నుంచి సంగ్రహించబడింది.

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. నేను కొన్ని సంవత్సరాల క్రితం అంబేద్కర్ పుస్తకాలు చదివాను. ఆ రోజుల లో మను ధర్మశాస్త్రం, పురాణాలు,అర్ణ్యకాలు ఇలాంటి వాటి మీద అంబేద్కర్ చాలా సమయము వెచ్చించాడు. I felt he studied puranas etc ., much more than brahmins. At that time I wondered myself to reject/condem old stuff do we need to study unimportant books also. నాకు తెలిసింది ఎమంటే మను ధర్మశాస్త్రం భారత దేశం అంతా ఒక్క మాదిరిగా ఎక్కడ అమలు జరిగిందో కచ్చితం గా చెప్పలేము. అంత వరకు ఎందుకు మనలో ఎంతమంది రాజ్యంగం అన్ని సెక్షన్ ల గురించి తెలుసు? మన పల్లేటూరి లో ఆ రోజులలో ఉన్న సర్పంచ్ లు, కరణాలు లేక గ్రామ పెద్దలు పంచాయితి తీర్పు నిచ్చె టప్పుడు మను శాస్త్రాన్ని ఆధారము చేసికొని భారత దేశమంతా ఒకేలా న్యాయము చెప్పారా? మీకు ఎమైనా తెలీస్తె చెప్పండీ. నాకు తేలిసి అలా జరుగ లేదు. అప్పుడు మనకు చాల మను ధర్మశాస్త్రం ప్రతులు లభ్యం కావాలి కదా ?

    ReplyDelete
  5. Neeku vere pani em leda! Pani ledu kabatte ilanti paniki maalina essays rasthunnavu! Adi kakunda kontha mandi paniki malina vallu neeku vathasu palukunnaru. Meeru bagu padi tarvatha desanni, prajalani bagu cheyandi!

    ReplyDelete