Tuesday, February 17, 2009

భారతదేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా?

భారత రాజ్యాంగంలో మన దేశం సెక్యూలరిస్టు అని ఉంటుంది. సెక్యూలరిస్టు అంటే అర్థం ఏమిటి? సెక్యూలరిస్టు అంటే ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడడం మరియు ఏ ఒక్క మతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకపోవడం. మరి మన దేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి.

మనం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలించి నిజంగా భారతదేశంలో సెక్యూలరిజం ఉన్నదో లేదో తేల్చుకుందాం. మొదట ఈ మధ్య మంగుళూరులో జరిగిన ఘటన. ఇది పబ్బు సంస్కృతికి వ్యతిరేఖంగా శ్రీరామ సేనవారు చేసిన ఘనకార్యం. ఈ సంఘటన తరువాత అన్ని పత్రికలు బిజేపీని, RSSను వాటి పద్దతులను విమర్శించాయి. దీని గురించి తరువాత వివరిస్తాను. ఇది జరిగిన కొన్ని రోజులకే బహిరంగంగా ముద్దు పెట్టుకుంటున్నందుకు ఒక జంటపై పోలీసులు కేసు నమోదు చేసారు. అది బహిరంగంగా జరిగినందువల్ల అసభ్యంగా భావించి కేసు పెట్టారు. నిజంగా ముద్దు పెట్టుకోవడం అసభ్యమా? అది పశ్చిమదేశాలలో కాదే? మరి మన దేశంలో మాత్రం ఎందుకు అసభ్యమైంది? ఎందుకంటే అది మన సంప్రదాయం కాదు కాబట్టి మరియు అలాంటి శృంగార కార్యాలు కేవలం ఇంటిలో జరిగితేనే బాగుంటాయి కాబట్టి. అది చూసిన జడ్జిగారు వారిద్దరూ వివాహితులైన జంట కారణంగా ఆ కేసును కొట్టివేసారు. ఇక్కడ పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? అది ప్రజలకు ఇబ్బందికరమైనది కాబట్టి. ఇలా ఒక జంట ముద్దులు పెట్టుకున్నందువల్ల మరికొన్ని జంటలు కూడా ఆ బాటలోనే పయనిస్తారు. ఇప్పుడు వీరిరువురికీ వివాహం జరిగింది. రేపు వివాహం జరగనివారు అదే పని చేస్తే? అప్పుడు ఆ జడ్జిగారు ఏమని తీర్పు ఇస్తారు? మన సంప్రదాయం ప్రకారం శృంగారకర్యాలు కాస్త నాలుగు గోడల మధ్య జరిగితే అందం చందం. సరే వివాహితులు కాబట్టి ఏ పనైనా బహిరంగంగా చేయవచ్చా? ఇప్పుడు ముద్దులతో మొదలయ్యింది, రేపు మిగిలిన శృంగార కార్యాలు అ తరువాత కాలకృత్యాలు, ఇక ఇవేగా మిగిలినది. ఇప్పుడు ముద్దులు వివాహితులు పెట్టుకున్నారు, రేపు అవివాహితులు పెట్టుకుంటారు. వారిపై కేసులు నమోదు చేయలేరు పోలీసులు. రేపు మరోసారి ఇలా ముద్దులు బహిరంగంగా పెట్టుకుంటున్న జంటను చూచి పోలీసులు వారు వివాహితులు అని వదిలేస్తారు. ఎందుకంటే ముద్దు పెట్టుకుంటున్న వారందరినీ ఆపి మీకు వివాహం అయ్యిందా అని పోలీసులు వారిని అడిగి, ఓహో అయ్యిందా సరే మీరు కానివ్వండి అని అనాలేమో. అలా అలా అందరూ మొదలుపెడతారు. ఇలాంటి చిన్న చిన్న తీర్పులే సమాజానికి ఎంతో హానికరం. ఒక గౌరవప్రదమైన జడ్జిగారు ఇవ్వవలసిన తీర్పు కాదిది. కానీ ఏమి చేస్తాం, ఇలాంటి వాటిపై మనం హైకోర్టులో పిటీషను వేయలేం కదా. నా ఉద్దేశంలో పై రెండు సంఘటనలకు పెద్ద తేడాలేదు శిక్ష అమలు చేసిన వారిలో తప్ప. ఒకరు (పోలీసులు) చట్టపరంగా అందుకు అర్హులు రెండోవారు (శ్రీరామ సేన) అనర్హులు. పై రెండు ఘటనలవల్ల సమాజానికి చివరికి జరిగేది నష్టమే.

ఇప్పుడు మంగుళూరు సంఘటన కాకుండా డావిన్సీ కోడు సినిమా, దాని మీద జరిగిన వివాదం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ చిత్రం విడుదలకు అన్ని క్రైస్తవసంఘాలు కాదన్నాయి. విడుదలైన చోట్ల బాగా గొడవలు చేసారు. మంగుళూరు ఘటనకు ఈ గొడవలకు ఏమైనా తేడా ఉన్నదా? ఆ చిత్రం ఏసు గురించి మనకు తెలిసిన నిజాలను కాక మరికొన్ని నిజాలను మనకు చెబుతుంది. ఆ చిత్రం తీసిన నిర్మాతలు (నవల రచయిత) ఆ నిజాల గురించి ఎంతో శోధించి శాస్త్రోక్తంగా ఎన్నో తెలియని విషయాలను నిరూపించి అప్పుడు ఆ చిత్రాన్ని విడుదల చేసారు. ఆ చిత్రాన్ని ఎన్నో క్రైస్తవ దేశాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదలకు అంగీకరించాయి. చివరికి పోపుకూడా అందుకు అంగీకరించాడు. కానీ అదేంటో భారతదేశంలో మాత్రం ఆ చిత్రాన్ని విడుదల చేయనివ్వలేదు. ఆ చిత్రం చూసినందువల్ల నష్టమేమీలేదని స్వయంగా పోపుగారు అంగీకరించారు. కానీ మన కోర్టులు అందుకు అంగీకరించలేదు. అదే మన సంస్కృతిని కాపాడుదామని ప్రయత్నిస్తే మాత్రం అది అన్ని విధాలా స్వేఛ్ఛకు ఆటంకం అయ్యింది. ఆ చిత్రాన్ని విడుదల చేయాల్సినప్పుడు ఏమైంది ఆ వ్యక్తిగత స్వేఛ్ఛ? ఏమైంది ఆ సెక్యూలరిజం అన్న పదం? పోలీసులు అసభ్యంగా ఉన్నదని కేసు పెట్టారు, మరి అప్పుడు కావలసిన వ్యక్తిగత స్వేఛ్ఛ చిత్రాన్ని (నిర్మాత విడుదల) చేయాల్సినప్పుడు ఏమైంది? ఇది చూసి కూడా మీరు భారతదేశంలో ఇంకా సెక్యూలరిజం ఉన్నది అనుకుంటే పొరబడినట్లే.

10 comments:

  1. పరమత సహనం అంటూ హిందూ మత ద్వేషాన్ని ప్రభోధిస్తున్న ఇది సెక్యులరిజం కాదు. ఆ ముసుగులో ఉన్న సూడో సెక్యులరిజం. ఓట్లు దండుకునే ప్రయత్నం మాత్రమే

    ReplyDelete
  2. సెక్యులరిజానికి, మీరు చెప్పిన విషయాలకి ఏమన్నా సంబంధముందా? ఎక్కడో మొదలెట్టి ఎక్కడో తేలారు.

    ఇక - డావించీ కోడ్ సినిమా గురించి. ఆ సినిమా చూడటం కానీ, నవల చదవటం కానీ మీరు చేశారా? అందులో నవలా రచయిత కొత్తగా చెప్పింది శూన్యం. మేరీ మాగ్దలిన్ గురించి డాన్ బ్రౌన్ ఈ నవల్లో రాసిన విషయాలు దశాబ్దాలుగా కధలుగా చెలామణిలో ఉన్నవే. మీరనుకుంటున్నట్లు ఆయన 'శాస్త్రోక్తంగా పరిశోధించి' తాను తెలుసుకుని మనకు తెలియజెప్పిన విషయాలు ఏమీ లేవందులో. డావించీ కోడ్ కేవలమో మసాలా పుస్తకం మాత్రమే, చరిత్ర పుస్తకం కాదు.

    ReplyDelete
  3. >>డావించీ కోడ్ కేవలమో మసాలా పుస్తకం మాత్రమే, చరిత్ర పుస్తకం కాదు.>>
    బైబిల్ నుంచి తొలిగించిన ఫిలిప్ సువార్తని తాను నమ్ముతున్నట్టు డావిన్సీ కోడ్ రచయిత చెప్పుకున్నాడు. అందుకే క్రైస్తవులకి ఆ రచయిత అంటే అంత కోపం. బైబిల్ లో ఒకదానికొకటి పొంతనలేని కథలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నిటిని తొలిగించడం కూడా జరిగింది. వాటినికి ఇంగ్లిష్ లో Biblical apocrypha అంటారు.

    ReplyDelete
  4. సరే, ఆ చిత్రంలో పెద్దగా నిజాలు చెప్పలేదని అన్నారుగా, మరి అలాంటిది ఒక ఊహాజనిత చిత్రం వల్ల వచ్చే నష్టం ఏమిటి? ఆదిత్య 369 ఒక ఊహాజనిత చిత్రం, మరి దానిని ఆపమని కోర్టు తీర్పు ఇవ్వలేదే? క్రైస్తవులకు కాస్త భంగం కలిగించే చిత్రాలను ఆపుతారు, అదే హిందువుల పేరు మీద చేస్తే నానా గొడవ చేస్తారు.
    మరో మాట, నేను చిత్రాన్ని చూసాను.

    ReplyDelete
  5. మన మతం గారు,

    డావించీ కోడ్ లో చెప్పినవన్నీ వాస్తవాలే అన్నట్లు మీరు రాస్తే సరి దిద్దటానికి నేను కామెంట్ రాశాను. ఇండియాలో ఆ సినిమా విడుదలైనా, కాకపోయినా నాకు వచ్చేదీ పోయేదీ ఏమీ లేదు. అయినా అడిగారు కాబట్టి చెబుతున్నాను: డావించీ కోడ్ కధ మేరీ మాగ్దలిన్‌తో క్రీస్తు వివాహం, వాళ్లిద్దరి పిల్లల గురించిన ఊహాజనిత గాధ. అది నిజం అని క్రైస్తవులు నమ్మితే గొడవే లేదు. వాళ్లు దాన్ని నమ్మరు కాబట్టే, వాళ్ల దృష్టిలో ఇటువంటి సినిమాలు క్రీస్తు వ్యక్తిత్వంపై బురద జల్లేవిగా కనిపిస్తాయి. ఎవరిదాకో ఎందుకు, నేను వివరించక ముందుదాకా మీరే అదంతా నిజమని నమ్మేశారు కదా. డావించీ కోడ్ లో రాసిందంతా నిఖార్సైన చరిత్ర అని నమ్మిన వాళ్లు నాకు బోలెడుమంది తెలుసు. అలా అవాస్తవాలు ప్రచారం చేస్తుందనే ఆ సినిమాపై/నవలపై విమర్శలు, వివాదాలు.

    క్రీస్తు గురించి వివాదాస్పద సినిమాలు రావటం ఇదే మొదలు కాదు, ఇదే చివర కూడా కాబోదు. కానీ దీన్నిమాత్రమే నిషేధించారంటే - అది మరీ హద్దులు మీరిందని అర్ధం. అలా హద్దులు మీరితే హిందూ దేవుళ్ల గురించి తీసినా ఇండియాలో నిషేధించబడతాయి. శ్రీరాముడికి సీత కాకుండా వేరే ఆవిడతో రహస్య సంబంధం ఉన్నట్లు ఎవరన్నా నవల రాసి దాన్ని సినిమా తీస్తే ఇండియాలో దాన్ని కూడా నిషేధిస్తారు. ఆ విషయంలో నాకు అనుమానమేమీ లేదు. ఆరేడేళ్ల క్రితమొచ్చిన 'లారా క్రాఫ్ట్ - టూంబ్ రైడర్' అనబడే మసాలా సినిమాలో ఒక సన్నివేశంలో హనుమంతుడిని పోలిన విగ్రహాలని దుష్ట శక్తులుగా చూపించారన్న కారణంతో ఆ సన్నివేశాలని ఇండియాలో సెన్సార్ కత్తెరకు బలి చేశారు. అది మతాలకి సంబంధించిన సినిమా కాదు, ఆ విగ్రహాలు నిజంగా హనుమంతుడివీ కావు. దీనికేమంటారు మీరు?

    కాబట్టి, సినిమాలని నిషేధించటం/చకపోవటం వంటి చిన్న చిన్న కారణాలు చూపించి ఇండియాలో హిందూయిజానికి వ్యతిరేకంగా ఉండేదే సెక్యులరిజం అనే అభిప్రాయానికి రావద్దు.

    ReplyDelete
  6. మార్తాండ గారు,

    డావించీ కోడ్ పై వివాదం ఫిలిప్ సువార్త ఒక్కదాని గురించీ కాదు. ఓపస్ డెయ్ వంటి ఛారిటీ సంస్థని హత్యలు చేసే/యించే రహస్య సంస్థలా చూపటం, క్రీస్తు రహస్య జీవితం గురించి ఆఫ్రికాలో ఎక్కడో ఏవో పురాతన పత్రాలు దొరికినట్లు నమ్మబలకటం, Priory of Sion అనే కల్పిత నామాన్ని పట్టుకొచ్చి నిజమైన సంస్థదిగా బుకాయించటం , లాస్ట్ సప్పర్ చిత్రంలో సెయింట్ జాన్ ని పట్టుకుని మేరీ మాగ్దలిన్‌గా వర్ణించటం (Dan Brown clearly mentioned all these as 'facts' in his book - there by deliberately misleading his readers) .. ఇలాంటివి ఇంకా అనేకం.

    ఆంగ్ల సాహిత్యంలో చరిత్రని కాల్పనిక గాధల్లో ఒడుపుగా ఇరికించటం అతి సాధారణ విషయం. హాలీవుడ్ సినిమాల్లోనూ ఈ ఒరవడి అనాదిగా ఉన్నదే. అయితే, డావించీ కోడ్ విషయంలో రచయిత విశృంఖలంగా వ్యవహరించటంతో గొడవలయ్యాయి. మీరు గాడ్ ఫాదర్-III చూశారా? 1979లో వాటికన్ పీఠమెక్కిన నెల రోజుల్లోనే మరణించిన పోప్ జాన్ పాల్-I అనుమానాస్పద మృతిని ఆ సినిమాలో కధకి అనువుగా ఎంత చక్కగా వాడుకున్నారో గమనించారా? దాని మీద వివాదాలేమీ చెలరేగలేదు మరి. ఎందుకంటే, కధలో ఎంత బాగా కలిసిపోయినా, అది కేవలం కల్పన అన్న సంగతి ప్రేక్షకులకి సులువుగా అర్ధమవుతుంది. ఇలాంటి వాటి వల్ల ఎవరికీ సమస్య లేదు.

    చివరగా - మీరో హేతువాది/నాస్తికుడు/కమ్యూనిస్టు అని నేనెరుగుదును. అయితే, మీ భావాలకు దగ్గరగా ఉన్నదన్న కారణంతో ప్రతి చెత్తనీ గొప్పదానిగా అంగీకరిస్తూ పోవటం, దాన్ని నెత్తినెక్కించుకోవటం ఎంతవరకూ సమంజసమో ఆలోచించండి. ఇలాంటి ధోరణివల్లనే సిసలైన హేతువాదం ప్రజల్లోకి చొచ్చుకుపోలేకపోతుంది.

    ReplyDelete
  7. బ్లాస్ఫెమిక్ సినిమాలని మీరు వ్యతిరేకిస్తున్నట్టు నాకు అనిపించింది కాబట్టే నేను సమాధానం వ్రాసాను. ఆ కథ రచయిత బైబిల్ నుంచి తొలిగించిన ఫిలిప్ సువార్తని తాను నమ్ముతున్నట్టు ఓపెన్ గా చెప్పుకున్నాడు. బైబిల్ కథలన్ని కట్టు కథలేనని నాకు తెలుసు. బైబిల్ నుంచి తొలిగించబడిన కథల్ని బయట పెట్టడం తప్పు కాదనే నేను నమ్ముతాను. బైబిల్ నుంచి తొలిగించిన కథల సీరీస్ లో బర్నబాస్ సువార్త కూడా ఒకటి. ఏసు క్రీస్తు దేవుడు కాదు, అతను ప్రవక్త మాత్రమే అని అందులో వ్రాసి ఉంది. ఆ సువార్తని క్రైస్తవులు నమ్మరు కానీ ముస్లింలు నమ్ముతారు. ఇస్లాంలో ముహమ్మద్ తరువాత ఏసు క్రీస్తు (ఈసా) రెండవ గొప్ప ప్రవక్త. బర్నబాస్ సువార్తలో ఏసు క్రీస్తు తరువాత మరో అభిషిక్తుడు (మెస్సయ్య) వస్తాడని వ్రాసి ఉంది. ముస్లింల దృష్టిలో చివరి అభిషిక్తుడు ముహమ్మద్ కావడం వల్ల కూడా ముస్లిం పండితులు బర్నబాస్ సువార్తకి అమోదం వేశారు. బర్నబాస్ సువార్త ని చర్చి అధికారులు తొక్కిపెట్టకముందు తొలితరం క్రైస్తవులు కూడా నమ్మేవాళ్ళు. ఈజిప్ట్ కి చెందిన ప్రధాన చర్చి అధికారి బర్నబాస్ సువార్తని నిషేధిస్తూ దేశంలోని అన్ని చర్చిలకి ఆదేశం జారీ చేశాడు. ఆ తరువాత మిగిలిన దేశాలలో కూడా చర్చి అధికార్లు బర్నబాస్ సువార్తని తొక్కిపెట్టడం జరిగింది. చాలా కాలం తరువాత చరిత్రకారులు బర్నబాస్ సువార్త వ్రాసి ఉన్న పురాతన పత్రాలని బయట పెట్టారు. చర్చి అధికార్లు అది దైవ ప్రేరణతో వ్రాసిన సువార్త కాదని వాదించారు, కొందరు ముస్లిం పెద్దలు మాత్రం ఆ సువార్తకి ఆమోద ముద్ర వేశారు. మత భక్తులు కథల్ని, చరిత్రని తమకి అనుకూలంగా ఎలా మలుచుకుంటారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. http://islam101.net/ & http://barnabas.net వెబ్ సైట్లు చదివితే ఈ విషయం కొంత వరకు అర్థమవుతుంది.

    ReplyDelete
  8. డాన్ బ్రౌన్ రాసిన వాటిలో అభూత కల్పనల గురించి నేను మాట్లాడుతుంటే మీరు ఆయన నమ్మే సువార్తల గురించి చెబుతారెందుకు? మీకు నా పాయింట్ అర్ధమవలేదు. వదిలేయండి.

    ReplyDelete
  9. విశాఖపట్నంలో బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వాహకుడు పాస్టర్ పొట్లూరి దేవ సుందర రావు కూడా డా విన్సీ కోడ్ సినిమా మీద చాలెంజ్ విసిరాడు. ప్రపంచంలో ఎవరితోనైనా చాలెంజ్ చెయ్యగలనని గోడల మీద పెయింటింగుల ద్వారా, తన భూతలక్రిందులు పత్రిక ద్వారా, వెబ్ సైట్ ద్వారా ప్రకటించుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన డా.జయగోపాల్ అనే నాస్తికుడు అతనితో చాలెంజ్ కి సిద్ధం అని పేపర్ లో ప్రకటించాడు కానీ సుందరరావు మాత్రం ముందుకి రాలేదు, జయగోపాల్ ఫిలిప్ సువార్త గురించి ప్రస్తావిస్తాడనే భయం వల్ల.

    ReplyDelete
  10. mitrama edi ela unna cristian deshalalo vidudalaina chitraniki secular desham lo anta atamkalu enduku vachai?

    ReplyDelete