మనకు మన గౌరవనీయులైన నందమూరి తారక రామారావు గారి హయాంలో మొదలైన అప్పులు తేవడం అనే వ్యసనం ఇప్పుడు కట్టలు తెంచుకొని వరదలై పొంగుతోంది. ఇప్పుడు మనరాష్ట్ర అప్పు లక్షాఇరవైవేలకోట్లని మన ఈనాడు పత్రిక తెలిపింది.
అప్పు తేవడం, దానిని ఎలా తీర్చాలి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూద్దాం. అది రామాపురమనే గ్రామం. అందులో వంద మంది నివశిస్తున్నారు. వారందరి వద్ద ఉన్న మొత్తం ధనం (కేవలం డబ్బు మాత్రమే, స్థిరాస్తులు, బంగారం వగైరా కాదు) వెయ్యి రూపాయలు. మొదట అప్పు ఇచ్చేవాడు ఇంత వడ్డీ కట్టాలి అని ఉంటుంది. అది మనం 5% శాతం. అంటే ప్రతీ వందరూపాయలు వడ్డీ తెచ్చేదానికి ప్రతీ సంవత్సరానికి వందకాకుండా మరో అయిదు రూపాయలు కూడా కట్టాలి. ఇప్పుడు మన రామాపురం కరణం అయిన రాము వరల్డు బ్యాంకు దగ్గరకు వెళ్ళి రోడ్లు కోసమని వందరూపాయలు 5% వడ్డీ లెక్కన తెచ్చాడు. వారు అందుకు రాముకు నువ్వు ఎలా కట్టగలవని ప్రశ్నిస్తే రాము తాను ప్రజలమీద పన్ను వేసి కడతానన్నాడు. రాము రెండు సంవత్సరాలలో సంవత్సరానికి యాభైఅయిదు రూపాయలలెక్కన కడతానన్నారు. సరేనన్నారు బ్యాంకు అధికారులు. అలా వందరూపాయలు ఇచ్చారు. రాము ఆ వందా వాడుకుని రెండు సంవత్సరాలలో వందకు వడ్డీ కలిపి మొత్తం మీద నూటపది రూపాయలు కట్టాడు. ఇప్పుడు ఆ గ్రామం మొత్తం ఛలామణీలో ఉన్న నగదు 990 మాత్రమే. ప్రజలకు కొంచెం జీవనప్రమాణాలు తగ్గాయనిపించినా కొత్త రోడ్లతో జనం మురిసిపోతున్నారు.
తరువాత రాము మళ్ళీ అప్పుకు వెళ్ళాడు. ఈ సారి హాస్పిటలు కట్టాలి అన్నాడు. అన్నీ ఇంతకు మునుపు రూల్సుమీద వరల్డుబ్యాంకు వారు అప్పు ఇచ్చారు. వారు ఇచ్చేటప్పుడు రాముకు ఒక సలహా చెప్పారు. అది అంతకు ముందు ఉన్న హోమియోపతి వైద్యులను గ్రామం నుంచి బహిష్కరిచమన్నారు, దాని ద్వారా ప్రజలందరూ ఖచ్చితంగా నీ హాస్పిటలుకే వస్తారు, నీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అన్నారు. రాము సరే అనకున్నా అప్పు ఇచ్చినవారు కాబట్టి వాళ్ళు చెప్పినది చెయ్యాల్సొచ్చింది. రెండేళ్ళు ముగిసేసరికి రాము నూటపది రూపాయలు కట్టి వచ్చాడు. ఇప్పుడు గ్రామం మొత్తం ఛలామణీలో ఉన్న నగదు 980 మాత్రమే. కాని ఇప్పుడు కొత్త హాస్పిటలు కట్టారు, వాటికి రేట్లు చాలా ఎక్కువ. ప్రజలు రాము తమను ఎక్కువ రేట్లతో బాధిస్తున్నాడని అనుకున్నారు. ప్రజలు కాస్త ఆరోగ్యసదుపాయాలు మెరుగయ్యాయని సంతోషపడిపోయారు.
ఈ సారి రాము తమ ఊరిలో విశ్వవిద్యాలయాన్ని స్థపించాలనుకున్నాడు. మళ్ళీ పాతకథే. తరువాత బ్యాంకు, విమానాశ్రయాన్ని నిర్మించాలనుకున్నాడు. అన్నీ బాగానే జరిగాయి. ఇలా పది సంవత్సరాలు గడిచేసరికి గ్రామానికి కొత్తరోడ్లు (వాటి మీద పన్ను), హాస్పిటలు, విశ్వవిద్యాలయం, విమానాశ్రయం, బ్యాంకు వచ్చాయి. వాటికి ధరలు అధికం. కానీ వేరే మార్గం లేదు. మంచి ఆసుపత్రి, వలన జీవనప్రమాణాలు పెరిగాయి. జనాభా పెరిగింది. ప్రస్తుతం జనభా నూటపది అయ్యింది. విశ్వవిద్యాలయం రావడం వలన చదువు కాస్త ఖరీదయింది. కాని ఇప్పుడు గ్రామం మొత్తం ఛలామణీలో ఉన్న నగదు 950 మాత్రమే. ధరలు పెరిగాయి. ఇది తట్టుకోలేక ప్రజలు తమ జీతం పెంచమన్నారు, కానీ యజమానులు తాము జీతాలు పెంచెతే తాము మనుగడ సాగించలేమన్నారు. ఇలా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు కాని అసలు ఆ యాభై రుపాయలు ఏమైపోయాయోనని ఒక్కరికి కూడా ఆలోచన రాలేదు. అది వరల్డు బ్యాంకు తెలివితేటలు.
ప్రపంచబ్యాంకు ఈ మధ్య విడుదల చేసిన నివేదికలో పేదలు ఇంకా పేదలుగా మిగులుతున్నారని, ధనవంతులు ఇంకా ధనవంతులవుతున్నారని చెప్పింది. ఇలా ఉన్న డబ్బును పీల్చుకుని పేదలను మరింత పేదలుగా చేస్తుంది కూడా వాళ్ళే. ఇప్పుడు మనరాష్ట్రం కూడా ఇలాగే అప్పులు తెస్తోంది. ఇలాగే ఏదో ఒక రోజు మనకు కూడా జరుగుతుంది. అప్పుడు మనం అవినీతిని సాకుగా చూపించినా అసలు సంగతి అది కాదని ఎవ్వరికీ తెలియదు. ఇది మనకు పూర్తిగా జరగడానికి ఇంకాస్త సమయముందని అనిపిస్తోంది. కాని ప్రస్తుతం ఇది నిజంగా అమెరికాలో జరుగుతోందని ఎంత మందికి తెలుసు. అమెరికాలో 1970 నుంచి కనీసవేతనం ఇంత వరకు పెరగలేదు, కానీ అన్ని వస్తువుల మీద ధరలు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఒక చిన్న ఉదాహరణ. అమెరికాలో రైతు గోధుమలు పండించే నాటి నుండి అవి బ్రెడ్డుగా మారి గృహిణి చేతిలోకి వచ్చేసరికి మొత్తం 50 రకాలపన్నులు ఉంటాయని ఒక నివేదిక సారాంశం. ఇది అమెరికా ప్రస్తుత ముఖచిత్రం. ఇప్పుడు అమెరికా గురించి మరికొన్ని నిజాలు. అమెరికా అప్పు తొమ్మిది ట్రిలియను డాలర్లు, కానీ అమెరికాలో ప్రస్తుతం వాడుకలో ఉన్న మొత్తం నగదు అక్షరాలా రెండువందలయాభై బిలియను డాలర్లు (ఒక ట్రిలియను అంటే వెయ్యి బిలియనులు). ఇది ఎలా సాధ్యమో నాకు అర్ధం కాలేదు. చైనా తన దగ్గర ఇప్పటికి ఒక ట్రిలియను డాలర్లు ఉన్నాయని చెప్పింది. టపా ముగించేముందు మరో చిన్న చేదు నిజం. మన రిజర్యు బ్యాంకు ఆఫ్ ఇండియా వారు బంగారం, వెండికి తోడుగా అమెరికా డాలర్లను కూడా నిల్వచేస్తున్నారని ఈ మధ్య తెలిసింది. మన దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి.
Wednesday, January 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment